వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదు

ABN , First Publish Date - 2021-12-31T05:16:21+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవడం లేదని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదు
శింగరాజుపాలెం గౌరవ సభలో మాట్లాడుతున్న ముప్పిడి

నల్లజర్ల/దేవరపల్లి, డిసెంబరు 30: వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవడం లేదని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. నల్లజర్ల మండలం శింగరాజుపాలెం, ఆవపాడు, దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రా మాల్లో గురువారం గౌరవ సభ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకు ధాన్యం సొమ్ము రైతులకు అందించలేదన్నారు. ఎరువులు విత్తనాలపై సబ్సిడీ ఇవ్వాలన్నారు. నిత్యావసర వస్తువులు ధరల పెరుగుదలతో సామాన్యులకు మరింత భారం పెరిగిందన్నారు.ఒమైక్రాన్‌ కేసులు నమోదు ఎక్కువ అవుతున్న ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాడం లేదన్నారు. లక్ష్మీపురంలో ఇంటింటికి పర్యటించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధనాలను వివరించారు. టీడీపీ నాయకులు తాతిన సత్యనారాయణ, గుదే సుబ్బారావు, కొఠారు అనంతలక్ష్మి, షేక్‌ మీరా సాహెబ్‌, మల్లిపూడి కృష్ణరావు, సవలం రామకృష్ణ, కూచిపూడి ఉదయభాస్కర్‌, శ్రీరామ్‌, కె.రవి కు మార్‌, నున్న నాగేశ్వరరావు, దెయ్యాల వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:16:21+05:30 IST