వైసీపీ దాడితో భగ్గుమన్న టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2021-10-21T05:00:34+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణారావు అన్నారు.

వైసీపీ దాడితో భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
కొవ్వూరులో బంద్‌ చేస్తున్న టీడీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు

బంద్‌ చేపట్టిన నేతలను అడ్డుకున్న పోలీసులు

ఎక్కడికక్కడ నిర్బంధం, నేతల బైండోవర్‌


కొవ్వూరు, అక్టోబరు 20: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణారావు అన్నారు. కొవ్వూరు పట్టణ, మండలంలో బుధవారం బంద్‌ నిర్వహించారు. బంద్‌ను విఫలం చేయడానికి పట్టణంలో భారీగా పోలీసులు మోహరించి నాయకులను అడుగడుగునా అడ్డుకున్నారు. శాంతియుతంగా బంద్‌ నిర్వహిస్తున్న నాయకులను బలవంతంగా వాహనాలలో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా అరెస్టుచేసిన నాయకులను విడుదల చేయాలని కార్యకర్తలు పోలీస్టేషన్‌ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అనంతరం సొంతపూచికత్తుపై విడుదల చేశారు. సూరపనేని, చిన్ని, మద్దిపట్ల శివరామకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వరరావు, పొట్రు శ్రీనివాసరావు, సూర్యదేవర రంజిత్‌, మరపట్ల కళాధర్‌, బేతిన నారాయణ, యలమాటి సత్యనారాయణ, పసలపూడి బోసు, తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి కేఎస్‌.జవహర్‌, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణారావు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్‌ (చిన్ని)ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.


గోపాలపురం: మండలంలో బంద్‌ బుధవారం ప్రశాంతంగా జరిగింది. బంద్‌ పిలుపుతో దుకాణాలు ముయిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా లు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని బలవంతంగా ఆటోలోకి ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సత్యనారాయణ, కొర్లపాటి రాము, ఉండవల్లి రత్నకుమారి, ఆలపాటి దుర్గాభవాని, చెదలవాడ ప్రసాద్‌, శరత్‌బాబు, మంగారావు, వేముల నాగరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. బంద్‌ పేరుతో దుకాణాలు మూయిస్తున్న 20 మంది టీడీపీ నాయకులను బైండోవర్‌ చేసినట్లు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


పోలవరం: మండలంలో టీడీపీ చేపట్టిన బంద్‌ కార్యక్రమాన్ని సీఐ ఏఎన్‌ఎన్‌.మూర్తి, ఎస్‌ఐ శ్రీను సిబ్బందితో కలిసి భగ్నం చేశారు. పోలవరం ఏటిగట్టు సెంటర్‌లో ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించాయి. గత రాత్రి నుండే గృహ నిర్భందంలో ఉన్న నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాసు సహా సుమారు 40 మందిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మండల కేంద్రంలో బంద్‌ పాక్షికంగా జరిగింది. కుంచే రాజేశ్‌, నల్లా రాంబాబు, పాదం ప్రసాద్‌ తెల్లం సూర్యచంద్రం, జె.రాజా, ఎ.రాజా, తదితరులు పాల్గొన్నారు.


జీలుగుమిల్లి: మండలంలో టీడీపీ నాయకులు బంద్‌ నిర్వహించారు. పోలీస్‌లు వారిని అడ్డుకున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు సుంకవల్లి సాయి ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకుల్ని పోలీస్‌ జీప్‌లో స్టేషన్‌కు తరలించారు. నాలీ శ్రీను, గూడపాటి పుల్లయ్య, యండ్ర రాజేంద్ర, శేఖర్‌, అంబుజూరి సత్యనారాయణ, తదితరులు ఉన్నారు. 


దేవరపల్లి: మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయ కులు బంద్‌ నిర్వహించారు. ముప్పిడి ఆధ్వర్యంలో బంద్‌ చేయడానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ముప్పిడిని, నాయకులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొయ్యలమూడి చినబాబు, పిన్నమనేని శ్రీమన్నారాయణమూర్తి, సుంకర దుర్గారావు, ముమ్మిడి సత్యనారాయణ, గద్దే సుబ్రహ్మణ్యం, మెంతిమి అమరావతి, బాదంపూడి ఇందిర, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:00:34+05:30 IST