పాలనలో జగన్‌ ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-12-08T05:14:13+05:30 IST

ప్రజల సమస్యలను పరిష్కారం, పాలనలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ విమర్శించారు.

పాలనలో జగన్‌ ప్రభుత్వం విఫలం
కొల్లాయిగూడెంలో మాట్లాడుతున్న బొరగం శ్రీనివాస్‌

బుట్టాయగూడెం, డిసెంబరు 7: ప్రజల సమస్యలను పరిష్కారం, పాలనలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ విమర్శించారు. సీతప్పగూడెం పంచాయతీ కొల్లాయిగూడెం లో మంగళవారం జరిగిన గౌరవసభలో ఆయన మాట్లాడారు. ఒక్క అవకా శం అడిగిన జగన్‌ చేసేందేమీ లేదని పలువురు మహిళలు తెలిపారన్నారు. వైసీపీ పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, మహిళా సాధికా రతపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. పేదలను వైసీపీ ప్రభుత్వం మను షులుగా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు రిజిస్ర్టేషన్‌ కోసం డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. నాయకులు మొగపర్తి సోంబాబు, సున్నం నాగేశ్వరావు, గుండు పోశమ్మ, మడకం రామకృష్ణ, మొడియం వెంకటలక్షీ, కారం సూర్యచంద్ర, తోడెం రాయుడమ్మ తదితరులు పాల్గొన్నారు.


కామవరపుకోట: వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పరి పాలన నిర్వహిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ విమర్శిం చారు. వీరిశెట్టిగూడెంలో గౌరవ సభ నిర్వహించారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ పేరుతో పేదల నుంచి డబ్బు వసూలు చేయడం తగదన్నారు. తమ ప్రభు త్వం అధికారంలోకి వస్తే నెల రోజుల్లోపే పేదల ఇళ్లకు సంపూర్ణ హక్కులు కలగజేస్తామన్నారు. ప్రభుత్వ విధానాలను మార్చుకోవాలని హితవుపలికారు. జడ్పీ మాజీ చైర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు, కిలారు సత్యనారాయణ, తూతా లక్ష్మణరావు, నెక్కలపూడి మల్లికార్జునరావు, దాసరి శ్యాంసుందర్‌ శేషు, కొయ్య గూర వెంకటేష్‌, తాడిచర్ల సర్పంచ్‌ పసుమర్తి పార్థసారధిబాబు పాల్గొన్నారు.


నల్లజర్ల: వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. పోతినీడుపాలెం, చాదరాశికుంట గ్రామాల్లో గౌరవ సభ ప్రజల సమస్యల పరిష్కార వేదిక మంగళవారం నిర్వహించారు. ముప్పిడి మాట్లాడుతూ నేరుగా ముఖ్యమంత్రే బోర్లు ఉన్న ప్రాంతాల్లో ధాన్యం పండించవద్దని చెప్పడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ధాన్యం కొనుగొలు చేయకపోడవంతో వర్షాలకు తడిసి తీవ్రంగా నష్టపోయారన్నారు. కార్యక్రమంలో తాతిన సత్యనారాయణ, గుదే సుబ్బారావు, సర్పంచ్‌ పిచ్చుకుల గణపతి, కూచిపూడి ఉదయ భాస్కర్‌, యలమర్తి సత్యనారాయణ, షేక్‌ పటాన్‌ సాహెబ్‌, ఉప్పు నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:14:13+05:30 IST