విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీలు వెనక్కి ఇచ్చేయాలి

ABN , First Publish Date - 2021-10-20T05:21:44+05:30 IST

విద్యుత్‌ వినియోగదారుల నుంచి ఇప్పటివరకు వసూలు చేసిన ట్రూఅప్‌ చార్జీలు వెనక్కి ఇచ్చేయాలని టీడీపీ నియోజక వర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీలు వెనక్కి ఇచ్చేయాలి
పోలవరంలో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

పోలవరం, అక్టోబరు 19: విద్యుత్‌ వినియోగదారుల నుంచి ఇప్పటివరకు వసూలు చేసిన ట్రూఅప్‌ చార్జీలు వెనక్కి ఇచ్చేయాలని టీడీపీ నియోజక వర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. గూటాల, పోలవరం గ్రామాలలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ట్రూ అప్‌ చార్జీలు వెనక్కి ఇచ్చేయాలని, విద్యుత్‌ చార్జీలు, పెట్రోలు, డీజిల్‌, నిత్యావసరాల ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఏఎంపీ మాజీ చైర్మన్‌ కుంచే దొరబాబు యడ్ల వినోద్‌, పాదం ప్రసాద్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రంలో అరాచక పాలన : ముప్పిడి వెంకటేశ్వరరావు


దేవరపల్లి, అక్టోబర్‌ 19: రాష్ట్రంలో ఆరచక పాలన నడస్తుందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు. దేవరపల్లిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ గుండాలు రాళ్లతో దాడి చేయడం, నాయకులపై దాడులు చేయడం దారు ణమన్నారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాం డ్‌ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. 


రాచరిక పాలన : మొడియం శ్రీనివాస్‌


కొయ్యలగూడెం: రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజాస్వామ్య పాలనో రాచరిక పాలనో అర్థం కావడం లేదని మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని ఖండించారు. ఒక పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం దారుణమన్నారు. పార్టీ ముఖ్య నేతల ఇళ్లపై దాడి చేయ డం దారుణమన్నారు. ఇటువంటి సంఘటనలను తక్షణమే అరికట్టాలని, దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం బంద్‌లో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. 

టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకో వాలని వాడపల్లి నాగార్జున, ఏఎంసీ  మాజీ చైర్మన్‌ పారేపల్లి నాగార్జున డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగడం దారుణమని ఈ సంఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2021-10-20T05:21:44+05:30 IST