రైతుకు దగా

ABN , First Publish Date - 2021-07-09T05:00:54+05:30 IST

రైతును దగా చేసిన ప్రభుత్వానికి రైతు దినోత్సవం నిర్వహించే అర్హత లేదని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.

రైతుకు దగా
వేళ్లచింతలగూడెంలో ర్యాలీ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి, తదితరులు

పండించిన పంటకు గిట్టుబాటు ధరల్లేవు

రైతులకు బకాయిలు చెల్లించలేదు

ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతల ధ్వజం


రైతును దగా చేసిన ప్రభుత్వానికి రైతు దినోత్సవం నిర్వహించే అర్హత లేదని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. రైతును నిర్లక్ష్యం చేస్తున్నారంటూ రైతు దగా దినోత్సవం పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వరి, అపరాలు, నూనెగింజలు, పెసర, మినుము, కందులు, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర లేక కరోనా కష్టకాలంలో రైతులు అప్పుల పాలయ్యారన్నారు. నిమ్మ, కూరగాయల రైతులు నష్టాల్లో ఉన్నారని, ధాన్యం విక్రయించిన రైతులకు నెలల తరబడి సొమ్ము చెల్లించలేదని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడు బిగిస్తున్నారన్నారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి విపత్తుల నిధి హామీలు ఏమయ్యాయని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు.


కొవ్వూరు, జూలై 8 : రైతులను దగాచేసి రైతు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్‌ రెడ్డికి లేదని టీడీపీ రాజమండ్రి పార్లమెంటు జిల్లా అధికార ప్రతినిధి బూరుగుపల్లి వీరరాఘవులు విమర్శించారు. కొవ్వూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలులేక రైతులు అప్పులు పాలవుతున్నారన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా, రైతులను దగాచేసి రైతు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్‌ రెడ్డికి లేదని రైతు దగా దినోత్సవం జరపాలి అంటూ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కోడి చంటియ్య, గారపాటి వెంకటకృష్ణ, మారిశెట్టి వీరవెంకట సత్యనారాయణ, కరుటూరి సతీష్‌, ముళ్లపూడి రాము, కావేటి రవిశేఖర్‌, పీవీవీ.భద్రం, ముత్యాల రాంబాబు పాల్గొన్నారు.


గోపాలపురం: రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించ కుండా దళారులతో రైతు శ్రమను దోపిడి చేసి వైసీపీ ప్రభుత్వం గద్దె దిగా లని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. వేళ్ల చింతలగూడెంలో గురువారం రైతు దగా దినోత్సవాన్ని నిర్వహించారు. పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు శ్రమను దోపిడి చేస్తుందన్నారు. ఆరుగాలం రైతు కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోగా పంటను అమ్ముకునేందుకు భిక్షాటన చేసే పరిస్థితి తెచ్చారన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించి, సకాలంలో సొమ్ములు చెల్లించి తరువాత రైతు దినోత్సవాలు చేసుకోవాలని హితవు పలికారు. మేని సుధాకర్‌, ముప్పిడి అశోక్‌, కొర్లపాటి శ్రీరామచంద్ర రావు, ఇల్లూరి రాము, ప్రసాద్‌, జ్యేష్ట శ్రీను, జ్యేష్ట శ్రీధర్‌, రమేష్‌, దుగ్గిరాల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


వేలేరుపాడు: రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవాలను జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ మండల అధ్యక్షుడు చీమల వెంకటేశ్వర్లు అ న్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంటకు గిట్టుబాటు ధర చెల్లించని ఈ ప్రభుత్వానికి రైతు దినోత్సవాలు జరుపుకునే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మూడు నెలలుగా తమకు రావలసిన ధాన్యం బకాయిల కోసం ఆందోళన చేస్తుండగా రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలు కూడా ఇవ్వలేమనే దుస్ధితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. సుభాష్‌ చం ద్రబోస్‌, బి.సురేష్‌, కారం రామకృష్ణ, అత్తిలి వెంకన్న పాల్గొన్నారు.


చింతలపూడి: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతు దగా దినోత్సవం పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ బీసీ నాయకులు కొమ్మ రాజు సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులపాలవుతున్నారన్నారు. సయ్యద్‌ రహీమ్‌, గంటా నాగభూషణం, సీ హెచ్‌ అంకమరావు, నత్తా రవి కుమార్‌, సత్తిబాబు పలువురు పాల్గొన్నారు.


పోలవరం: రైతు దినోత్సవం కాదని రైతు దగా దినోత్సవమని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ విమర్శించారు. టీడీపీ కార్యాల యంలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా, పంట నష్టపరిహారం, బీమా ప్రీమియం, పెట్టుబడి రాయితీలు, చెల్లిపుంలలో జగన్మోహన్‌రెడ్డి రైతులను మోసం చేశారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ  మాజీ వైస్‌ చైర్మన్‌ కుంచే వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ మండల కోఅర్డినేటర్‌ జే.శేషవెంకట జితేం ద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T05:00:54+05:30 IST