చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-08-11T04:37:49+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి వలవల బాబ్జి విమర్శించారు.

చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం
చేనేత కార్మికులకు న్యాయం చేయాలని టీడీపీ నాయకుల ఆందోళన

పెంటపాడు, ఆగస్టు 10: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి వలవల బాబ్జి విమర్శించారు. మంగళవారం రామచంద్రపురం, మీనవల్లూరు గ్రామాలలోని చేనేత కార్మికులను కలిసి మాట్లాడారు. తొలుత గ్రామ తెలుగుదేశం నాయకులు వాసా గణపతి, యర్రా కనకలింగేశ్వరరావులు నూలుపోగు మా లతో బాబ్జికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేనేత కుటుంబాలకు చెందిన పలువురు మహిళలు తమకు చేనేత పథకం ద్వారా రావల్సిన రూ.24 వేల రూపాయలను ఈ సంవత్సరం నిలిపివేశారని తెలిపారు. కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌చౌదరి, మాజీ జడ్పీటీసీ కిలపర్తి వెంకట్రావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ దాసరి అప్పన్న, తెలుగుయువత అధ్యక్షుడు మద్దిపాటి ధర్మేంద్ర, పాలూరి భాస్కరరావు, నల్లమిల్లి చినగోపిరెడ్డి, దాసరి సతీష్‌కుమార్‌, పుట్టా రాంబాబు, పుట్టా రమేశ్‌, పాతూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-11T04:37:49+05:30 IST