జగన్‌కు తగిన గుణపాఠం చెప్పాలి : సీతారామలక్ష్మి

ABN , First Publish Date - 2021-12-09T05:49:14+05:30 IST

రాష్ట్ర అభివృద్ధిని వదిలి వ్యక్తిగత కక్షలతో పాలన చేస్తున్న జగన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని నరసాపురం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షురాలు తోటసీతారామలక్ష్మి అన్నారు.

జగన్‌కు తగిన గుణపాఠం చెప్పాలి : సీతారామలక్ష్మి
గౌరవ సభలో మాట్లాడుతున్న సీతారామలక్ష్మి

వీరవాసరం, డిసెంబరు 8 : రాష్ట్ర అభివృద్ధిని వదిలి వ్యక్తిగత కక్షలతో పాలన చేస్తున్న జగన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని నరసాపురం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షురాలు తోటసీతారామలక్ష్మి అన్నారు. మండలంలోని వీరవల్లిపాలెంలో బుధవారం నిర్వహించిన గౌరవ సభలో ఆమె మాట్లాడారు. మహిళలను గౌరవించే సంస్కృతిని విస్మరించి వారిపట్ల నీచంగా మాట్లాడి గౌరవ సభను కౌరవ సభగా మార్చిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. గౌరవ సభ పేరుతో ప్రజా సమస్యల చర్చావేదిక నిర్వహిస్తున్నామన్నారు. నిత్యవసరాల ధరల భారం, పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు పెరుగుదల, ఓటీఎస్‌ వసూళ్లు తదితర సమస్యలపై  ప్రసంగించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెంటే పార్థసారఽథి, మండలశాఖ అధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాస్‌, మామిడిశెట్టి ప్రసాద్‌, వీరవల్లి దుర్గాభవాని , కడలి నెహ్రూ, కవురు శివకృష్ణ, వీరవల్లి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T05:49:14+05:30 IST