నిర్వాసిత కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-08-22T05:13:25+05:30 IST

నిర్వాసితుల కాలనీల్లో సమస్యలను తక్షణం పరిష్కరించాలని నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ కోరారు.

నిర్వాసిత కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలి
నిర్వాసితుల కాలనీ పరిశీలించిన బొరగం

కొయ్యలగూడెం, ఆగస్టు 21: నిర్వాసితుల కాలనీల్లో సమస్యలను తక్షణం పరిష్కరించాలని నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ కోరారు. సరిపల్లిలో నిర్మించిన కొత్తూరు నిర్వా సిత కాలనీని శనివారం ఆయన పరిశీలించారు. నిర్వాసితులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. డ్రెయినేజీ, రోడ్లు సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రధాన రహదారి అధ్వానంగా ఉందని, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు చేతికి అందే ఎత్తులో ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీనివాస్‌ తెలిపారు. ఆయన వెంట ఏఎంసీ మాజీ చైర్మన్‌ పారేపల్లి రామారావు, మాజీ ఎంపీపీ అయినపర్తి చందన, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T05:13:25+05:30 IST