హామీలు నెరవేర్చని ప్రభుత్వం : ఆరిమిల్లి

ABN , First Publish Date - 2021-12-25T06:12:43+05:30 IST

సమస్యల సుడిగుండంలో ప్రజలు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

హామీలు నెరవేర్చని ప్రభుత్వం : ఆరిమిల్లి
సమావేశంలో మాట్లాడుతున్న ఆరిమిల్లి

తణుకు, డిసెంబరు 24: సమస్యల సుడిగుండంలో ప్రజలు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం 22వ వార్డులో గౌరవసభలో మాట్లాడారు. అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎటువంటి హమీలు నెరవేర్చలేదన్నారు. టీడీపీ పూర్వ వైభవానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కలగర వెంకటకృష్ణ, పరిమి వెంకన్నబాబు, తమరాపు రమణమ్మ, తణుకు రేవతి, తోట సూర్యనా రాయణ, మాదాసు రాంబాబు ఒమ్మి రాంబాబు, నల్ల భాస్కరావు తదితరలు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-25T06:12:43+05:30 IST