అంతటా బంద్‌

ABN , First Publish Date - 2021-10-21T05:18:32+05:30 IST

ఏపీలో వైసీపీ అరాచక ప్రభుత్వం నడుస్తోందని నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆరోపించారు.

అంతటా బంద్‌
భీమవరంలో తోట సీతారామలక్ష్మిని అడ్డుకుంటున్న పోలీసులు

ఊరూ వాడా టీడీపీ బంద్‌ విజయవంతం

నాయకుల గృహ నిర్బంధాలు.. అరెస్టులు

స్వచ్ఛందంగా వ్యాపారుల మూసివేత

రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌


భీమవరం అర్బన్‌, అక్టోబరు 20 : ఏపీలో వైసీపీ అరాచక ప్రభుత్వం నడుస్తోందని నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆరోపించారు.బంద్‌లో పాల్గొడానికి వెళుతున్న తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారఽథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావులను భీమవరం పట్టణ పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో పట్టణ టీడీపీ నాయకులు వారిళ్ల వద్ద స్వయంగా కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ పఽథకం ప్రకారం టీడీపీ ఆస్తులపై దాడులు చేసిన వైసీపీ మూకలు టెర్రరిస్టులుగా వ్యవహరిస్తున్నారని, దాడుల్లో పాల్గొన్నవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ కరెంట్‌ కష్టాలపై ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ దాడులు చేస్తున్నారని విమర్శించారు. గొల్లవానితిప్పలోని బ్యాంకు, షాపులను మూసి వేయించారు. 


పాలకొల్లు అర్బన్‌/ పాలకొల్లు రూరల్‌ :  సీఎం జగన్‌కు ప్రజాస్వామ్యం అంటే ఏ మాత్రం గౌరవం లేదని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ విమర్శించారు. పాల కొల్లులో ఎమ్మెల్యే రామా నాయుడు, ఎమ్మెల్సీ అంగర, పెచ్చెట్టి నరసింహారావు (బాబు), కర్నేన రోజా రమణి, కర్నేన గౌరునాయుడు, జీవీలను పోలీసులు బుధవారం ఉదయమే గృహ నిర్బంధం చేశారు. దీంతో  కార్యకర్తలు పెద్ద ఎత్తున వారి వారి గృహాలకు చేరుకుని పోలీసులతో ఘర్షణకు దిగారు. శాంతియుతంగా ర్యాలీ చేయడానికి అనుమతించాలని పట్టణ సీఐ ఆంజనే యులును ఎమ్మెల్యే కోరారు. పోలీసులు అంగీకరించడంతో భారీ ర్యాలీ చేశారు. కార్యకర్తలు దారిలో దుకాణాలను మూ యించి వేశారు.పెన్మెత్స రామభద్ర రాజు,రామారావు, దాసరి రత్నరాజు,అవతారం రాజు,  బోణం నాని పాల్గొన్నారు.


కాళ్ళ : టీడీపీ నాయకులుపై దాడి హేయమైన చర్య అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజును బుధవా రం భీమవరం రూరల్‌ పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై నాయకులపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఎమ్మెల్యే వెంట అడ్డాల శివరామరాజు, పిన్నమనేని శ్రీనివాసరాజు తదితరులు ఉన్నారు.  


పాలకోడేరు : వైసీపీ రాక్షస పాలనపై ప్రజలు విసుగు చెందారని రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని మండల టీడీపీ అధ్యక్షుడు దెందుకూరి ఠాగూర్‌ కోటేశ్వరరాజు అన్నారు. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా పాలకోడేరు మండలంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ నాయకులు బంద్‌ చేపట్టారు. మండల టీడీపీ నాయకుడు దెందుకూరి ఠాగూర్‌ కోటేశ్వరరాజును పోలీసులు గృహనిర్భందం చేశారు. మిగిలిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, షాపులను మూయించివేశారు. ఈ కార్యక్రమంలో దొంగ కృష్ణ, చేబోలు రామకృష్ణ, సంకురుడు, అప్పారావు, నాగరాజు, శ్రీనివాస్‌, కాజా వీరాస్వామి పాల్గొన్నారు. 


పెనుగొండ : పెనుగొండలో బంద్‌ ప్రశాంతంగా సాగింది. మండలంలోని టీడీపీ నాయకులు,కార్యకర్తలు పెనుగొండలో నిరసన ప్రదర్శన చేశారు.  ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు,వ్యాపార సంస్థలు, స్కూల్స్‌ మూసివేశారు.   టీడీపీ నాయకులను పోలీసులు స్టేషన్‌కు తరలించి విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కార్యదర్శి గంధం వెంకట్రాజు, పెనుగొండ పట్టణ అధ్యక్షుడు కటికిరెడ్డి నానాజీ, వేండ్ర రాము, నక్కా వేద వ్యాస శాస్త్రి ,వెలిచేటి బాబూ రాజేంద్ర ప్రసాద్‌, మండా ప్రసాద్‌,మద్దింశెట్టి వెంకటేష్‌ పాల్గొన్నారు. 


ఆకివీడు/రూరల్‌ : బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేప ట్టారు. పట్టణ, మండల గ్రామాల్లో షాపులు మూసి వేసి సంఘీభావం తెలిపారు. పాఠశాలలు, బ్యాంకులు మూసివేశారు. రాక్షస పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తమకు సంఘీభావం తెలియజేస్తున్నారని తెలుగురైతు రాష్ట్ర ఉపా ధ్యక్షుడు భూపతిరాజు తిమ్మరాజు అన్నారు.


మొగల్తూరు : టీడీపీ బుధవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ మొగల్తూరులో విజ యవంతమైంది.మాజీ జడ్పీటీసీ గుబ్బల నాగరాజు, మాజీ సర్పంచ్‌ మామిడిశెట్టి సత్యనారాయణ,మాజీ ఎంపీపీ కత్తిమండ ముత్యాల రావు, కలిదిండి కుమార్‌ బాబు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బస్వాని ఏడుకొండలు, పాలా రాంబాబు, డొల్లా రత్నంరాజు తదితరులు గాంధీబొమ్మల సెంటర్‌ నుంచి దుకాణాలు మూసివేసి బంద్‌కు సహకరించాలని వ్యాపారులను కోరారు.  ఇదే సమయంలో అక్కడే ఉన్న ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బంది వర్తకులు దుకాణాలు మూయనవరం లేదని వారికి చెబుతుండడంతో టీడీపీ నాయకులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.మొగల్తూరు, నరసాపురం ఎస్‌ఐలు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించడమే కాకుండా బంద్‌లో పాల్గొన్న టీడీపీ శ్రేణులను తీవ్ర ఇబ్బం దులు పెట్టారన్నారు.అధికారం ఎప్పుడు ఏ ఒక్క పార్టీ సొత్తు కాదని పోలీసులు, ప్రజలు శాశ్వతమనే విషయాన్ని మొగల్తూరు ఎస్‌ఐ గుర్తించాలన్నారు. గుబ్బల నాగరాజు, కొప్పాడ రవీంద్రనాధ్‌ ఠాగూర్‌, జోగి పండు, వాతాడి ఉమామ హేశ్వ రరావు, డొల్లా రత్నంరాజు, కత్తిమండ ముత్యాలరావు, ఏడుకొండలు, జక్కం శ్రీమన్నారాయణ, పాలూరి బాబ్జి, మౌలాలీ, సత్యనారాయణ పాల్గొన్నారు. 


పోడూరు : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు ధ్వజమెత్తారు. మండలంలో బుదవారం  బంద్‌ పాటించారు.వాణిజ్య వ్యాపార సంస్థలను టీడీపీ నాయకులు మూసివేయించారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుబ్బల అప్పన్నస్వామి, ఊడిగ శ్రీనివాసరావు, మేడపాటి గంగాధరరెడ్డి, దొంగ గవరయ్య, మేడపాటి రామకృష్ణారెడ్డి,బొక్కా శ్రీను, ఉండ్రాజవరపు వెంకట్రావు, వాసంశెట్టి సత్యనారా యణ, గుబ్బల వెంకటేశ్వరరావు, చింతపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 


ఆచంట : ఆచంటలో బంద్‌ బుధవారం విజయవంతమైంది.  ఉదయాన్నే టీడీపీ నాయకులు కచేరి సెంటర్‌కు చేరుకుని దుకాణాలు,  షాపులు మూయిం చి వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. టీడీపీ శ్రేణులను ఆచంట ఎస్‌ఐ ప్రసాద్‌, పోలీసులు అడ్డుకున్నారు. తరువాత ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు తమ నిరశన చేపట్టారు.కార్యక్రమంలో గొడవర్తి శ్రీరాములు, మండల టీడీపీ అధ్యక్షుడు కేతా మీరయ్య, బీరా నర్శింహమూర్తి, తమ్మినీడి ప్రసాద్‌, బాలం వెంకటరమణ, కేతా మురళి, నెక్కంటి సత్తిబాబు, మానేపల్లి సత్యనారాయణ, పెచ్చెట్టి మూర్తి, సీతారామ్‌, దబ్బా ప్రకాష్‌ పాల్గొన్నారు.


నరసాపురం : టీడీపీ బంద్‌ విజయవంతమైంది. దుకాణాలు, బ్యాంకులు, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు తిరగ లేదు. మెయిన్‌రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. తెల్లవారుజామునే టీడీపీ నాయకులు అంబేడ్కర్‌ సెంటర్‌కు చేరుకుని హోటళ్ళు, దుకాణాలను మూసివే యించారు. విద్యా సంస్థలు మూతపడ్డాయి. బ్యాంకులు పనిచేయలేదు.  మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. అందోళనలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, మాజీ చైర్‌ పర్సన్‌ రత్నమాలను అరెస్టు చేసి మొగల్తూరు స్టేషన్‌కు తరలించారు.   మధ్యా హ్నం 2 గంటల సమయంలో పోలీసులు విడుదల చేశారు. సీఎంగా జగన్‌ కొనసాగే నైతిక హక్కును కోల్పోయారన్నారు. కేంద్రం కల్పించుకుని రాష్ట్రపతి పాలన విఽధించాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవి, పద్మ, అకన సుబ్రహ్మణ్యం, భూపతి నరేష్‌, రవి , మౌలాలీ, బోరా చిన్నాయమ్మ,తంగేళ్ళ నాగేశ్వరావు, మల్లాడి మూర్తి, తుమ్మలపల్లి లక్ష్మినారాయణ, చిటికెల రామ్మోహన్‌, కొట్టు పండు, కుక్కల మీరయ్య, బళ్ళ మూర్తి, రేవు ప్రభుదాసు, తాతాజీ, గన్నవరపు శ్రీనువాస్‌, చాగంటి ఆనంద్‌ పాల్గొన్నారు.


వీరవాసరం : మండలంలో బంద్‌ విజయవంతమైంది. నాయకులు విద్యాసంస్థలు, వ్యాపార దుకాణాలను మూసివేయించారు. బంద్‌కు వ్యాపారస్తులు కూడా మద్దతు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. టీడీపీ , జనసేన నాయకులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండా జయప్రకాష్‌నాయుడు, వీరవల్లి చంద్రశేఖర్‌, కొల్లేపర శ్రీనివాస్‌, వీరవల్లి శ్రీనివాసరావు, కముజు హరిబాబు , కడలి నెహ్రు, జక్కంశెట్టి రాజాప్రసాద్‌, కవురు భాస్కరరావు, పులఖండం జయ తదితరులు పాల్గొన్నారు.  


పెనుమంట్ర : వైసీపీ ఆగడాలు సహించేది లేదని టీడీపీ మండల అధ్యక్షుడు తమనంపూడి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.  ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, పాఠశాలలను మూయించివేశారు. కొద్దిసేపు ఽధర్నా చేసి నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు గూడూరి మురళీమోహన్‌, వెలగల మల్లికార్జున రెడ్డి, తేతలి రాజారెడ్డి, కట్టా బాలజీవన్‌కుమార్‌, అచ్యుతరామయ్య, కర్రి జగదీష్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సానబోయిన గోపాలకృష్ణ, గంటావాసు, మండ్ర సుదాకర్‌, చింతపల్లి రామకృష్ణ, నరాలశెట్టి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


ఉండి : ఉండిలో బంద్‌ విజయవంతమైంది. ఉండి పెద్ద వంతెన సెంటర్‌ నుంచి మోటర్‌ సైకిళ్లపై ర్యాలీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు జుత్తుగ శ్రీను, ఉపాధ్యక్షుడు గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ,  పొత్తూరి వెంకటేశ్వరరాజు, కరిమెరక శ్రీను, మంతెన సాయిలచ్చిరాజు,  యశోద కృష్ణ, బురిడి రవిబాబు, కిన్నెర వెంకన్న, మాండ్రు సందీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:18:32+05:30 IST