అరెస్టులు..గృహ నిర్బంధాలు

ABN , First Publish Date - 2021-10-21T04:57:15+05:30 IST

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన జరిగిన దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్త బంద్‌కు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన బంద్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు సర్వ శక్తులు ఒడ్డారు.

అరెస్టులు..గృహ నిర్బంధాలు
పెంటపాడులో టీడీపీ నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు

బంద్‌ను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు

టీడీపీ నాయకుల నిరసనలు, ధర్నాలు

తాడేపల్లిగూడెం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) :తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన జరిగిన దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్త బంద్‌కు పార్టీ  ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన బంద్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు సర్వ శక్తులు ఒడ్డారు.ముఖ్య నాయకులను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. ధర్నాలను అడ్డుకున్నారు. పార్టీ శ్రేణులు రోడ్డుపైకి రాకుండా ఎక్కడికక్కడ అవరోధాలు సృష్టించారు. ఈ సందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. 

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జ్జి వలవల బాబ్జిని అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తర లించారు. పోలీస్‌ ఐలాండ్‌ వద్ద ధర్నాకు దిగిన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్య దర్శి గొర్రెల ఽశ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూరల్‌ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్‌, తెలుగురైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరిని గృహ నిర ్బంధం చేశారు. అయినా రవికుమార్‌ తప్పించుకుని పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. బాబ్జి అరెస్ట్‌తో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు బంద్‌కు మద్దతు తెలిపాయి. పోలీస్‌ స్టేషన్‌ వద్ద వారంతా నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పట్టణ అధ్యక్షుడు బడుగు పద్ద, కొల్లి రమావతి, ఆకాశపు స్వామి, సబ్నివీసు కృష్ణమోహన్‌ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ పరిధిలో దాదాపు 30 మందిపై కేసు నమోదు చేశారు. స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. అనంతరం బాబ్జి నేతృత్వంలో పోలీస్‌స్టేషన్‌ నుంచి పోలీస్‌ ఐలాండ్‌ మీదుగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. పట్టణంలో స్వచ్చంద బంద్‌ పాటించారు. ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేశారు. బంగారు దుకాణాలు మధ్యాహ్నం తర్వాత తెరిచారు. సినిమా థియేటర్‌లలో ఉదయం ఆటలను నిలిపివేశారు.  

తణుకు :  పట్టణంలో  పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్రపతి రోడ్డుమీదుగా పార్టీ నాయకులు ర్యాలీగా వస్తుండగా పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కలగర వెంకటకృష్ణ, డాక్టర్‌ దొమ్మేటి వెంకటసుధాకర్‌, బసవా రామకృష్ణ, పరిమి వెంకన్నబాబు, మంత్రిరావు బాబులను గృహ నిర్బంధం చేశారు. వేల్పూరులో పార్టీ నాయకులు నిరసన తెలిపారు. విశ్వనాథం కృష్ణవేణి, సాదే శామ్యూల్‌రాజు, వల్లూరి మోహన్‌, వెంకట రాజారావు పాల్గొన్నారు.

 నిడదవోలు:నిడదవోలు పట్టణంలో బంద్‌ నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు బైటకు రాగా గణేష్‌చౌక్‌ సెంటరులో పోలీసులు అరెస్టు చేసి  స్టేషన్‌కు తరలించారు.మారిశెట్టి సత్యనారాయణ, మద్దుకూరి రాధ, బుగ్గే శివరామకృష్ణ శాస్ర్తి, అంబటి వెంకటరమణ, షాజహాన్‌, కుమార్‌, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్‌ కారింకి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. 

పెరవలి : మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. బంద్‌లో భాగంగా ప్రభుత్వ కార్యా లయాలు, బ్యాంక్‌లు, వ్యాపారసంస్థలు మూసి వేశారు. టీడీపీ నాయకులను పోలీసులు పోలీసు స్టేషన్‌కు తరలించి అనంతరం విడిచిపెట్టారు. మండల టీడీపీ అధ్యక్షుడు సలాది కృష్ణమూర్తి, డీసీఎంఎస్‌ మాజీ అధ్యక్షుడు భూపతి రాజు రవివర్మ, పెరవలి ఎంపీటీసీ రాపాక ప్రమీల, మండల పరిషత్‌ మాజీ అధ్యక్షుడు కోటిపల్లి మురళీకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్‌ సమన్వయ కర్త బొడ్డు రామాంజనేయులు, అబ్బిశెట్టి సత్తిరాజు, చిట్టూరి వెంకట నారాయణ, ఉప్పల పాటి సత్తిరాజు, తులా జాన్‌ప్రసాద్‌, దాసం బాపన్ననాయుడు, కారు మూరి శేషుబాబు, కంటిపూడి సూర్యనారాయణ, మానికిరెడ్డి మురళీకృష్ణ, రావూరి నైజామ్‌, బి.రవిబాబు పాల్గొన్నారు.  

అత్తిలి: అత్తిలి బస్టేషన్‌ సెంటర్‌లో ధర్నా చేస్తున్న టీడీపీ శ్రేణులను పోలీ సులు అరెస్టు చేశారు.స్టేషన్‌వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఇరగవరం: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉం టుందని, దానిని జీర్ణించుకోలేక భౌతిక దాడులకు దిగటం దారుణమని నరసా పురం పార్లమంట్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు ధ్వజమెత్తారు.    టీడీపీ నాయకులను గృహనిర్బంధం చేశారు. మాజీ ఎంపీటీసీ ఏడుకొండలు, మండల యువత అధ్యక్షుడు గూడూరి నాగరాజు, పార్టీ సెక్రటరీ కామన రాం బాబు, ఎస్సీ సెల్‌ నాయకుడు మల్లిపూడి శివ తదితరులు పాల్గొన్నారు.

పెంటపాడు : మండల టీడీపీ అద ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, నర్సాపురం పార్లమెంట్‌ తెలుగురైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌చౌదరి, గూడెం నియోజకవర్గ తెలుగురైతు, బీసీ సెల్‌ అద్యక్షులు పీతల సత్యనారాయణ, బండారు వెంకట్రావు, మాజీ ఉపసర్పంచ్‌ నల్లమిల్లి చినగోపిరెడ్డి, పెంటపాడు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు దాసరి సతీష్‌కుమార్‌లను పోలీసులు గృహ నిర్భంధం చేశారు. కొంతమంది నాయకులు బయటకు వచ్చి పెంటపాడు గ్రామంలో బారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.దీంతో పెంటపాడు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నాయకులు బుద్దన ధనరాజు, అద్దంకి వెంకటేశ్వరరావు, చెప్పుల వాసు, పెనుమర్తి జగదీష్‌, దాసి విద్యాసాగర్‌, కొండపల్లి చినశ్రీను పాల్గొన్నారు.

గణపవరం :మండల టీడీపీ ఆధ్వర్యంలో పిప్పరలో జరిగిన బంద్‌ ప్రశాం తంగా ముగిసింది. కార్యకర్తలు, గ్రామంలోని బ్యాంక్‌లు, ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలు మూసివేశారు. మూడు రోడ్ల జంక్షన్‌ రహదారిపై బైఠాయిం చారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఇందు కూరి రామకృష్ణంరాజు, ఏలూరు పార్లమెంట్‌ టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యాళ్ల సుబ్బారావు, ఏలూరు పార్లమెంట్‌ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కోదండ రాంబాబు, మొయ్యేరు టీడీపీ అధ్యక్షుడు కానుమిల్లి చంటి, ముప్పర్తి పాడు పార్టీ అధ్యక్షుడు అల్లూరి బదిరి నారాయణ, మాజీ సర్పంచ్‌ ఇంటూరి చంద్రమోహనరావు పాల్గొన్నారు. 

నిడమర్రు : నిడమరుర మండల పార్టీ అధ్యక్షుడే ముత్యాల స్వామి,  గ్రామ పార్టీ అధ్యక్షుడు గిద్దా సింహద్రి , బొబ్బిలి అబ్బులు, గాది సత్తికొండలను హౌస్‌ అరెస్టు చేశారు. నిడమర్రు సెంటర్‌లో పొట్నూరి సింహాచలం  విజయభాస్కర్‌ తదితరులు ధర్నా నిర్వహించారు. 


తాలిబన్ల రాజ్యంలో ఉన్నామా : వలవల బాబ్జి

అటు పోలీసులు, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు వైఖరి చూస్తుంటే తాలిబన్ల రాజ్యంలో ఉన్నట్టు ఉందని తాడేపల్లిగూడెం నియోజ కవర్గ ఇన్‌చార్జ్జి వలవల బాబ్జి మండిపడ్డారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యాల యంపై దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రకటించిన హోంమంత్రి సుచరితకు ఆ పార్టీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వినిపిం చడం లేదా అంటూ నిలదీశారు.  


ప్రభుత్వం ఉసిగొల్పిన దాడులే : ఆరిమిల్లి

టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన దాడిని ప్రభుత్వం ఉసిగొల్పిన దాడులుగానే భావిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వ లోపాలను ప్రఽశ్నస్తే దాడులు చేయడం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా ప్రజాస్వామ్య విలువలు ఖూనీ చేస్తున్నదని విమ ర్శించారు. విజయవాడ నుంచి తణుకు వస్తున్న రాధాకృష్ణను ఉంగుటూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.అక్కడ నుంచి నేరుగా ఉండ్రాజవరం రోడ్డులోని ఆయన నివాసం వద్దకు తరలించారు. బయటకు రాకుండా సీఐ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.




Updated Date - 2021-10-21T04:57:15+05:30 IST