పెన్షన్లు తొలగిస్తారా..?

ABN , First Publish Date - 2021-09-04T05:13:12+05:30 IST

45 ఏళ్ల వయసు వారికి సైతం పెన్షన్‌ ఇస్తామని, పెన్షన్‌ మూడు వేలకు పెంచుతామని ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి.. ఉన్న పెన్షన్లు పీకేస్తున్నారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు.

పెన్షన్లు తొలగిస్తారా..?
గోపాలపురంలో వినతిపత్రం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి

ప్రభుత్వ తీరుపై టీడీపీ ధ్వజం

లబ్ధిదారులకు అండగా ఆందోళన


45 ఏళ్ల వయసు వారికి సైతం పెన్షన్‌ ఇస్తామని, పెన్షన్‌ మూడు వేలకు పెంచుతామని ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి.. ఉన్న పెన్షన్లు పీకేస్తున్నారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. కారణాలు వెతికి పట్టుకుని మరీ పెన్షన్లు పీకేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దుర్మార్గం అన్నారు. ఒకే కార్డులో ఉన్నవారికి పెన్షన్లు ఎలా ఎత్తివేస్తారని, మరో కార్డు జారీ చేయాలన్నారు. పెన్షన్‌ ఇచ్చే రోజు లబ్ధిదారు అందుబాటులో లేకుంటే ఇక ఇవ్వరా..? ఇంత ఘోరమైన నిర్ణయం ఎలా తీసుకున్నారని నిలదీశారు. గ్రామ సచివాలయ సిబ్బంది తల్లిదండ్రులకు పెన్షన్లు ఎత్తివేయడం దారుణమన్నారు. ప్రభుత్వ అసమర్ధతను కప్పిపచ్చుకోడానికి ప్రజలను బలి చేయడం భావ్యం కాదన్నారు. పెన్షన్‌ మొత్తం పెంచాలని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, ఉన్న పెన్షన్లు తొలగిస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మండల పరిషత్‌ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.


జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 3: తొలగించిన పెన్షన్‌లను వెంటనే పునరు ద్ధరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్‌చంద్రశేషు డిమాండ్‌ చేశారు. పెన్షన్‌ల తొలగింపుపై ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేసి టీడీపీ నాయకలు నిరసన వ్యక్తం చేశారు. బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌, ఆకుమర్తి రామారావు, ఎస్‌ఎస్‌ ఇస్మాయిల్‌, గొల్లమందల శ్రీను, నంగులూరి జగత్‌, ముళ్ళపూడి శ్రీను, ఎలికే ప్రసాద్‌, ఉండవల్లి శ్రీను, ఆలపాటి రాము, మాదవ్‌, చదలవాడ నాగేశ్వరరావు, శైల సత్యనారాయణ, రాగాని రామకృష్ణ, గంటా శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


పోలవరం: పింఛన్‌దారులను జగన్‌ ప్రభుత్వం మోసం చేసిందని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ విమర్శించారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తంచేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కుంచే దొరబాబు, పాదం ప్రసాద్‌, మాగంటి రాము, సూర్యచంద్రం, ఖమ్మంబాటి గోపి, జిత్తేంద్ర పాల్గొన్నారు.


గోపాలపురం / దేవరపల్లి: పింఛన్లు తొలగించరాదని గోపాలపురం ఎంపీడీవో శ్రీదేవికి మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వినతిపత్రాన్ని అందజేశారు. దేవరపల్లి ఎంపీడీవోకు కూడా వినతిపత్రం అందజేశారు.


చింతలపూడి: టీడీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని నినాదాలు చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు మాటూరి వెంకట్రామయ్య, పట్టణ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు, కొ క్కిరిగడ్డ జయరాజు మాట్లాడారు. తొంమండ్రు దేవ, రామారావు, నల్లమాటి రామకృష్ణ, అంకమరావు, బోడా నాగభూషణం, తాటి అప్పారావు, మన్యం సత్తిబాబు, కంభం రమేష్‌, ఉలాస సుబ్బారావు, ఏసు పాల్గొన్నారు.Updated Date - 2021-09-04T05:13:12+05:30 IST