భీమవరంలో టమాటా కిలో రూ.60
ABN , First Publish Date - 2021-11-27T05:02:37+05:30 IST
భీమవరం మార్కెట్‌లో కిలో టమాటా రూ.60లు మాత్రమే.

రెండు రోజులే అవకాశం..
భీమవరం, నవంబరు 26 : భీమవరం మార్కెట్‌లో కిలో టమాటా రూ.60లు మాత్రమే. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కిలో టమాటా రూ.120లకు విక్రయిస్తు న్నా రు.ధర ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరానికి సంబంధించిన హోల్‌సెల్ వ్యాపారులతో గురువారం చర్చించారు. దీంతో నియోజకవర్గంలోని ప్రతీ రిటైల్ కూరగాయల దుకాణాల్లో కిలో టమాటా రూ.60కే విక్రయించే విధంగా హోల్‌సెల్ వ్యాపారులు ముందుకు వచ్చారు.దీనిపై భీమవరానికి చెందిన ప్రము ఖ హోల్‌సెల్ వ్యాపారి కనకారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శుక్ర, శని రెండు రోజుల పాటు నియోజకవర్గంలో ప్రతీ రిటైల్ దుకాణంలోనూ కిలో టమాటా రూ.60కే విక్రయించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.