వెళితే.. పడతాం!

ABN , First Publish Date - 2021-12-31T05:20:36+05:30 IST

వెళితే పడిపోవడం ఖాయం.. ఇదేదో మారుమూల రహదారి దుస్థితి కాదండోయ్‌.. జిల్లాలోని ఒక ప్రధాన రహదారి దుస్థితి..

వెళితే.. పడతాం!
రోడ్డుపై దారిని వెతుకుతున్న వాహన డ్రైవర్‌

అధ్వానంగా తాడేపల్లిగూడెం – నిడదవోలు రోడ్డు

నందమూరు వద్ద రోడ్డంతా గోతులే

కన్నెత్తిచూడని పాలకులు.. అధికారులు

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 30 : వెళితే పడిపోవడం ఖాయం.. ఇదేదో మారుమూల రహదారి దుస్థితి కాదండోయ్‌.. జిల్లాలోని ఒక ప్రధాన రహదారి దుస్థితి.. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే రహదారి.. అయినా ఏళ్లగా ఆ రహదారిని పట్టించుకునే నాథులే కానరావడంలేదు.. అదే తాడేపల్లిగూడెం నిడదవోలు ప్రధాన రహదారి.. సుమారు 12 కిలోమీటర్లు ఉండే రహదారిలో అన్నీ గోతులే.. కాస్త ఆదమరుపుగా  ప్రయాణించినా ప్రమాదమే.. ఎందుకంటే ఏ గొయ్యి చూసినా రెండు నుంచి మూడు అడుగుల లోతులో ఉంటాయి. అయినా  ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. రెండున్న రేళ్లుగా ఈ రోడ్డు గోతులతో నిండి పదుల సంఖ్యలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు వదిలిన ఘటనలు ఉన్నాయి. నందమూరు గ్రామం వద్ద సుమారు కిలోమీటరు మేర అసలే రోడ్డే కానరాదు.. కాస్త దూరం వచ్చేసరికి అంతా మట్టే.. అది తారు రోడ్డా.. మట్టి రోడ్డా తెలియని పరిస్థితి.. ఈ రోడ్డున కనీసం పది మంది గోతుల్లో పడి గాయాల పాలవుతుండడం నిత్యకృత్యంగా మారింది. పాలకులు, అధికారులు      ఈ రోడ్డు గురించి మర్చిపోయారా అన్న చందంగా ఈ రహదారి తయారైంది. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిఽధులు పట్టించుకుని ఈ రోడ్డును పునర్‌ నిర్మించాలని వాహన చోదకులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2021-12-31T05:20:36+05:30 IST