తెరుచుకున్న.. నిఘా నేత్రం

ABN , First Publish Date - 2021-12-31T05:22:18+05:30 IST

తాడేపల్లిగూడెం పట్టణంలో పోలీసులు దాతల సహకారంతో రూ.24లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 84 హెచ్‌డీ సీసీ కెమేరాల కమాండింగ్‌ కంట్రోల్‌ రూంను జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గురువారం ప్రారంభించారు.

తెరుచుకున్న.. నిఘా నేత్రం
సీసీ కెమేరాల కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, ఎస్పీ

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 30 : తాడేపల్లిగూడెం పట్టణంలో పోలీసులు దాతల సహకారంతో రూ.24లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 84 హెచ్‌డీ సీసీ కెమేరాల కమాండింగ్‌ కంట్రోల్‌ రూంను జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ మాట్లాడుతూ అధునాతన టెక్నాలజి సీసీ కెమేరాల నిఘాతో పట్టణంలో అంతా అప్రమత్తంగా ఉండేందుకు అవకా శం ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మన కోసం పనిచేసే రక్షణ వ్యవస్థకు మన వంతుగా సహకరించాలని ముందుకు వచ్చిన దాతలను అభినందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బి.శ్రీనాథ్‌, సీఐలు  వీరా రవికుమార్‌, ఆంజనేయులు ఎస్సైలు జీజే ప్రసాద్‌, బి.రాజు, ఎన్‌.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:22:18+05:30 IST