యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద
ABN , First Publish Date - 2021-01-13T05:17:58+05:30 IST
యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్ అన్నారు.

పాలకొల్లు అర్బన్, జనవరి 12 : యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్ అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా రంగమన్నారు పేటలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సేవా సమితి అధ్యక్షుడు బిహెచ్ వెంకటేశ్ వడయార్, నీలం రవి, వెంకటరామరెడ్డి, యు శ్రీనివాస్, జయప్రకాశ్ నారాయణ, చినమిల్లి గణపతిరావు, సిద్ధుల శ్రీను, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు వస్త్రాలు, పండ్లు, స్వీట్లు అందజేశారు. బీఆర్ ఎంవీఎం హైస్కూల్ గ్రౌండ్‌లో కర్రా జయసరిత ఆధ్వర్యంలో వివేకానందుడికి నివాళులర్పించారు. కొత్తపేట మునిసిపల్ స్కూల్లో వివేకానద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాలకొల్లు అర్బన్ : లయన్స్ క్లబ్, యూత్‌హాస్టల్స్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు నందుల రమణి ప్రారంభించారు. యువజన దినోత్సవం సందర్భంగా ఈకార్యక్రమం ఏర్పాటు చేసినట్లు యూత్ హాస్టల్స్ చైర్మన్ కారుమూరి సూర్యనారాయణ తెలిపారు. శిబిరంలో 18 మంది రక్తదానం చేశారు. ఎన్‌ఏ.అన్నపూర్ణ, కె.అచ్చుతానంద జ్యోతి, శ్రిఖాకొల్లు కామేశ్వరరావు, కొమ్ముల మురళీకృష్ణ, సిబ్బంది నాగలక్ష్మి, ఎం.వందన, చినబాబు, బివి కృష్ణ, ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు.
భీమవరం / ఎడ్యుకేషన్: యువత వివేకానందుని స్ఫూర్తిగా దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడాలని బివిరాజు కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్‌వి శ్రీనివాస్ ప్రతిజ్ఞ చేయించారు. వైస్ ప్రిన్సిపాల్ సిహెచ్‌వి సత్యనారాయణ, ఎంసీఏ కళాశాల ప్రిన్సిపాల్ ఐఆర్‌కె.రాజు, తదితరులు పాల్గొన్నారు. శ్రీవి జ్ఞాన వేదిక కన్వీనర్ అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయం తి నిర్వహించారు. వివేకానందుని చిత్రపటానికి షేక్ ఖాశిం, అల్లు శ్రీనివాస్, బొల్లా శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు.