16 నుంచి చిన వెంకన్నకు సుప్రభాత సేవలు నిలుపుదల

ABN , First Publish Date - 2021-12-10T05:14:38+05:30 IST

ధనుర్మాసం సందర్భంగా చిన వెంకన్న ఆలయంలో ఈనెల 16 నుంచి వచ్చే నెల 14 వరకు సుప్రభాత సేవలను నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు.

16 నుంచి చిన వెంకన్నకు సుప్రభాత సేవలు నిలుపుదల

ద్వారకాతిరుమల, డిసెంబరు 9: ధనుర్మాసం సందర్భంగా చిన వెంకన్న ఆలయంలో ఈనెల 16 నుంచి వచ్చే నెల 14 వరకు సుప్రభాత సేవలను నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. సుప్రభాత సేవల స్థానంలో తిరుప్పావై పాసురాలను పండితులు ప్రతీ రోజు వివరిస్తారన్నారు. వచ్చే నెల 14న ఆలయంలో గోదాదేవి కల్యాణం నిర్వహి స్తామని, 15న మకర సంక్రమణ సందర్భంగా స్వామి వారి నిత్యార్జిత కల్యాణాన్ని ఆ రోజు రద్దు చేస్తున్నామని ఆయన వివరించారు.

Updated Date - 2021-12-10T05:14:38+05:30 IST