మండుతున్న ఎండతో బెంబేలు

ABN , First Publish Date - 2021-05-30T06:11:57+05:30 IST

ఎండ వేడిమికి చిన్నారులు, వృద్ధులు అల్లాడుతున్నారు.

మండుతున్న ఎండతో బెంబేలు
ఉదయం 11 గంటలకు నిర్మానుష్యంగా జీలుగుమిల్లి ప్రధాన రహదారి

జీలుగుమిల్లి, మే 29 : ఎండ వేడిమికి చిన్నారులు, వృద్ధులు అల్లాడుతున్నారు. శనివారం ఉదయం కనిష్ఠంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత  నమోదైంది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావ డంతో కర్ఫ్యూ సమయానికి ముందే రహదారులు బోసి పోయాయి. జీలుగు మిల్లి నాలుగు రోడ్ల కూడలి నిర్మానుష్యంగా దర్శనం ఇచ్చింది. సాయంత్రం 6.30గంటల వరకు వాతావరణంలో వేడి గాలులు తగ్గలేదు. రోహిణి కార్తె ప్రభావం వల్ల వేడి గాలులు వీస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.


పోలవరం: పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు కర్ఫ్యూ సడలింపు సమయం లో సైతం జనం ఇళ్లకే పరిమితమ్యారు. ఎండవేడిమి, ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు విద్యుత్‌ సరఫరా నిలుపుదల మరింత కష్టం కలిగించింది. ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక ప్రజలు అవస్థలుపడ్డారు.

Updated Date - 2021-05-30T06:11:57+05:30 IST