తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-01T05:15:43+05:30 IST

తల్లి మృతిని తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య

యలమంచిలి, డిసెంబరు 31 : తల్లి మృతిని తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామానికి చెం దిన రామశెట్టి సాయిసందీప్‌(24) తల్లి ఇటీవల మృతిచెందింది. దీంతో మనస్తా పానికి గురైన సందీప్‌ గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎం తకీ తిరిగిరాలేదు.దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అతని ఆచూకీ కోసం గాలించారు. చించినాడ బ్రిడ్జి సమీపంలో అతని మోటార్‌ సైకిల్‌ను బంధువు వై.సుబ్బారావు గమనించి యలమంచిలి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేశాడు. పోలీసులు గోదావరిలో గాలించగాగా సందీప్‌ మృతదేహం లభ్యమైంది.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-01-01T05:15:43+05:30 IST