వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-05-08T06:25:10+05:30 IST

తనకు న్యాయం చేయా లంటూ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ యువకుడి ఉదంతమిది.

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం
ట్యాంక్‌ ఎక్కిన మావుళ్లు

పెదపుల్లేరు (ఉండి), మే 7: తనకు న్యాయం చేయా లంటూ  వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ యువకుడి ఉదంతమిది.  పోలీసు లు, స్థాని కుల వివరాల మేరకు ఉండి మండలం పెదపుల్లేరు గ్రామానికి చెందిన పులిమం తుల మావుళ్లు (25)  ఏడాది క్రితం గ్రామంలోని ఒక వ్యక్తి నుంచి మూడు సెంట్లు స్థలం రూ.1.5 లక్షలకు ఇద్దరు మధ్య వర్తుల ద్వారా కొనుగోలు చేశాడు. అయితే తనకు స్థలం అప్పగించాలంటూ మధ్యవర్తులను తరచూ అడుగుతున్నా వారు సమాధా నం చెప్పేవారు కాదని, శుక్రవారం కూడా వారిని అడిగితే  స్థలం లేదు.. ఏం లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో మన్నారని మావుళ్లు ఆరోపించాడు.  అంతకు ముందు ఈ విషయం స్థానిక రెవెన్యూ అఽధికారు ల దృష్టికి తీసుకు వెళ్లినా స్పందన లేకపోవడంతో చేసేదేమీ లేక ఆత్మహత్యకు సిద్ధమయ్యానని మావుళ్లు తెలిపాడు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు,  స్థానిక పెద్దలు, వీఆర్వో వచ్చి వారం రోజుల్లో స్థలం ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.   


Updated Date - 2021-05-08T06:25:10+05:30 IST