జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-09T04:57:18+05:30 IST

జీవితంపై విరక్తితో ఒక వ్యక్తి రైలు కింద పడి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.

జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య

ఏలూరు క్రైం, మే 8:  జీవితంపై విరక్తితో ఒక వ్యక్తి రైలు కింద పడి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఏలూరులోని పడమరవీధికి చెందిన పర్సా నాగేశ్వరరావు (53)కు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఏలూరు జూట్‌మిల్లు సమీపంలో ఓవర్‌ బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రైల్వే ఎస్‌ఐ చంద్రశేఖర్‌కు సమాచారం అందడంతో సిబ్బందితో వెళ్లి పరిశీలించారు.ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-05-09T04:57:18+05:30 IST