సుబ్రహ్మణ్యేశ్వరుడికి స్వామిమలై అలంకరణ

ABN , First Publish Date - 2021-12-09T06:11:38+05:30 IST

పోస్టల్‌ కాలనీ నాగదేవత ఆలయంలో షష్ఠి ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామికి స్వామిమలై అలంకరణ చేశారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడికి స్వామిమలై అలంకరణ
స్వామిమలై అలంకరణలో సుబ్రహ్మణ్యేశ్వరుడు

ఏలూరు కార్పొరేషన్‌, డిసెంబరు 8:పోస్టల్‌ కాలనీ నాగదేవత ఆలయంలో షష్ఠి ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామికి స్వామిమలై అలంకరణ చేశారు. భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుని భక్తి సంకీర్తనలు ఆలపించి, భజనలు చేశారు. కొవిడ్‌ నిబంధనలతో తీర్థప్రసా దాలు స్వీకరించారు. ప్రధాన అర్చకుడు ఉటుకూరి సాయిబాబాశర్మ భక్తులతో అర్చనలు జరిపిం చారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రాంబాబు, సత్యనారాయణరెడ్డి మిత్ర బృందం భక్తులకు ఏర్పాట్లు చేశారు. గురువారం కల్యాణం జరుగుతుందని తెలిపారు.

Updated Date - 2021-12-09T06:11:38+05:30 IST