లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు : సబ్‌ కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-09T05:52:53+05:30 IST

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సబ్‌ కలెక్టర్‌ విష్టుచరణ్‌ హెచ్చరించారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు : సబ్‌ కలెక్టర్‌
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌

నరసాపురం టౌన్‌, డిసెంబరు 8: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సబ్‌ కలెక్టర్‌ విష్టుచరణ్‌ హెచ్చరించారు.సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో లింగ నిర్ధారణ డివిజన్‌ స్థాయి కమిటీతో సమావేశం బుధవారం నిర్వహించారు. పిండ లింగ నిర్ధారణ చట్టరిత్యా నేరమన్నారు. డివిజన్‌లో 54 స్కానింగ్‌ సెంటర్లకు మాత్రమే అనుమతి ఉందన్నారు. లబ్ధిదారులకు ఓటీఎస్‌పై అవగాహన కల్పిం చాలని హౌసింగ్‌, ఎంపీడీవో, తహసీల్దార్‌, కమిషనర్లకు సూచించారు.డివిజన్‌ పరిధిలో గురువారం మేళా విజయవంతం చేయాలన్నారు. 


Updated Date - 2021-12-09T05:52:53+05:30 IST