బ్యాలెట్‌ పేపర్లను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-02-06T05:05:46+05:30 IST

పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్‌ పేపర్లు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చాయి.

బ్యాలెట్‌ పేపర్లను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌
ఆచంటలో బ్యాలెట్‌ పేపర్లు పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

ఆచంట, ఫిబ్రవరి 5: పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్‌ పేపర్లు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చాయి. నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌ శుక్రవారం వాటిని పరిశీలించారు. బ్యాలెట్‌ పేపర్లలో ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్‌.శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. 


పొరపాట్లకు తావులేకుండా పోలింగ్‌ ఉండాలి

నరసాపురం రూరల్‌: పోలింగ్‌, కౌంటింగ్‌లో ఎటువంటి పొర పాట్లకు తావులేకుండా ప్రశాంతంగా చేపట్టాలని సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ అదేశించారు. మండలంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో పోలింగ్‌, కౌంటింగ్‌ సిబ్బందికి శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలింగ్‌, కౌంటింగ్‌లో రిటర్నింగ్‌ అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిం చాలన్నారు. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. పోలింగ్‌ నుంచి కౌంటింగ్‌ వరకు రిటర్నింగ్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్‌ చేపట్టాలన్నారు. ఒకటి రెండుసార్లు నిబంధనలు సరి చూసుకోవాలన్నారు. డీఎల్‌పీవో నాగలత, తహసీల్దార్‌ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T05:05:46+05:30 IST