పాఠశాల మూయవద్దంటూ ఆందోళన

ABN , First Publish Date - 2021-10-30T04:52:59+05:30 IST

పట్టణంలో ఎయిడెడ్‌ పాఠశాల అయిన సెయింట్‌ ఆన్స్‌ తెలుగమీడియం స్కూల్‌ మూసివేతను వ్యతిరేకిస్తూ శుక్రవారం విద్యార్థులు, తల్లితండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు.

పాఠశాల మూయవద్దంటూ ఆందోళన
పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు

నిడదవోలు, అక్టోబరు 29: పట్టణంలో ఎయిడెడ్‌ పాఠశాల అయిన సెయింట్‌ ఆన్స్‌ తెలుగమీడియం స్కూల్‌ మూసివేతను వ్యతిరేకిస్తూ శుక్రవారం విద్యార్థులు, తల్లితండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు జువ్వల రాంబాబు మాట్లాడుతూ విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల మూసివేయడం సరికాదని, మిగిలిన ఆరు నెలలు కూడా పాఠశాల విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారుల వద్దకు వచ్చిన మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ విద్యార్థుల తల్లితండ్రులతో మాట్లాడి పాఠశాల యాజమాన్యంతో సంప్రదించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. మరోపక్క విద్యార్థులు స్కూల్‌ ముందు బైఠాయించి మా బడి మాకు కావాలంటూ నినాదాలు చేశారు.


Updated Date - 2021-10-30T04:52:59+05:30 IST