విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2021-10-30T05:02:06+05:30 IST

మార్టేరు హాస్టల్‌లో విద్యార్థిని గెడ్డం స్రవంతి మృతిపై పలు అనుమానా లు ఉన్నాయని మలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తన్నేటి పుష్పరాజ్‌ అన్నారు.

విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి
హాస్టల్‌ వద్ద ఆరా తీస్తున్న టీడీపీ నరసాపురం పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ విభాగం అధ్యక్షుడు చుక్కా సాయిబాబా

పెనుమంట్ర, అక్టోబరు 29 : మార్టేరు హాస్టల్‌లో విద్యార్థిని గెడ్డం స్రవంతి మృతిపై పలు అనుమానా లు ఉన్నాయని మలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తన్నేటి పుష్పరాజ్‌ అన్నారు.హాస్టల్‌ను శుక్రవారం పరిశీలించి సంఘటనపై వివరాలను తెలుసుకున్నారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌, సభ్యుడు చెల్లెం ఆనంద ప్రకాష్‌లకు ఫిర్యాదు చేశామని తెలిపారు. హాస్టల్‌లో చదువుకునే విద్యార్థినులకు రక్షణ కరువైందనడానికి మార్టేరు సంఘటనే నిదర్శనమని టీడీపీ నరసాపురం పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ విభాగం అధ్యక్షుడు చుక్కా సాయిబాబా అన్నారు. స్రవంతి మృతిపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వారి వెంట భావన సత్యనారాయణ, బల్ల త్రిమూర్తులు, చెల్ల రాజ్‌కుమార్‌ , ప్రసాద్‌, టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు పీతల బాబ్జి, మట్లముని బాబు ఉన్నారు. 

Updated Date - 2021-10-30T05:02:06+05:30 IST