రక్షించేదెలా..?

ABN , First Publish Date - 2021-12-30T06:28:23+05:30 IST

తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఒక వృద్ధురాలు కొద్ది రోజుల క్రితం ఏలూరు కాలువలో జారి పడిపోయింది.

రక్షించేదెలా..?
తాడేపల్లిగూడెం అగ్నిమాపక కేంద్రం

పాడైన రెస్క్యూ బోటు

కొత్త  దానికి ప్రతిపాదనలు పంపిన అగ్నిమాపక శాఖ 

పట్టించుకోని ప్రభుత్వం.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు

తాడేపల్లిగూడెం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఒక వృద్ధురాలు కొద్ది రోజుల క్రితం ఏలూరు కాలువలో జారి పడిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు స్థానిక అగ్నిమాపక కేంద్రానికి  సమా చారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది గాలించినా ఫలితం లేకపోయింది. అయితే రెస్క్యూబోటు లేకపోవడంతో కాలువలో దిగి అన్వేషించ లేకపోయారు. రెండు రోజుల తర్వాత జిల్లా కేంద్రానికి సమాచారమిచ్చారు. జంగారెడ్డిగూడెం నుంచి రెస్క్యూ బోట్‌ను రప్పించి కాలువలో గాలించారు. వృద్ధురాలి మృతదేహాన్ని వెలికితీశారు. కనీసం కడసారి చూపుకైనా నోచుకున్నా మంటూ అగ్నిమాపక సిబ్బందికి మృతురాలి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ప్రాణ రక్షణకు అవసరమయ్యే రెస్క్యూ బోట్‌ తాడేపల్లిగూడెం అగ్నిమాపక కేంద్రంలో లేకపోవడం బాధాకరమంటూ పట్టణ ప్రజలు వాపోతున్నారు. టీడీపీ హయాంలో మంజూరైన రెస్క్యూ బోట్‌ నాలుగేళ్లే పనిచేసింది. ఇటీవల పాడైంది. దానిని జిల్లా కేంద్రానికి అందజేశారు. కొత్త రెస్క్యూ బోట్‌ను ఇవ్వా లని ప్రతిపాదించారు. ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సి ఉంది. బోటు విలువ రూ. 6 లక్షలు ఉంటుంది. కొద్దిపాటి నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేసే పరిస్థితిలో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Updated Date - 2021-12-30T06:28:23+05:30 IST