ఆర్‌బీకేలతో నాణ్యమైన సేవలందించాలి

ABN , First Publish Date - 2021-12-30T05:49:04+05:30 IST

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన సేవలను అందించాలని రాష్ట్ర సివిల్‌ సప్లయి కమిషనర్‌ గిరిజాశంకర్‌, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సిబ్బందికి స్పష్టం చేశారు.

ఆర్‌బీకేలతో నాణ్యమైన సేవలందించాలి
వట్లూరు ఆర్‌బీకే వద్ద సిబ్బందితో మాట్లాడుతున్న సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తదితరులు

పెదపాడు/నల్లజర్ల, డిసెంబరు 29 : రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన సేవలను అందించాలని రాష్ట్ర సివిల్‌ సప్లయి కమిషనర్‌ గిరిజాశంకర్‌, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సిబ్బందికి స్పష్టం చేశారు. పెదపాడు మండలం వట్లూరులో ఆర్‌బీకే, సత్యకృష్ణ రైస్‌ మిల్లు, నల్లజర్లలో ఆర్‌బీకేలో వున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. వట్లూరులో ఆర్‌బీకే ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, అందుబాటులో ఉంచిన ఎరువులు, వాటికి సంబంధించి స్టాకు రిజిస్టర్‌ వివరాలను కమిషనర్‌ పరిశీలించారు. ఎంతమంది రైతులు ఈ–క్రాప్‌లో పంట నమోదు చేసుకున్నది, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, వారికి నగదు చెల్లింపులను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంతమేర ధాన్యం కొనుగోలు చేశారో వ్యవసాయ అధికారులను అడిగి తెలుసు కున్నారు. అనంతరం రైస్‌మిల్లులో ధాన్యం ఏవిధంగా దిగుమతి చేసు కుంటున్నారు.. గ్రేడింగ్‌  ప్రాసెసింగ్‌ విధానాలను పరిశీలించారు. నల్లజర్లలో రైతు లతో కమిషనర్‌ మాట్లాడుతూ రైతులు తమకు నచ్చిన ధరలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గాని బయట మార్కెట్‌లో గాని విక్రయించుకునే అవకాశం ఉందన్నారు. జేసీ (రెవెన్యూ) డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌, ఏలూరు ఆర్డీవో పనబాక రచన, సివిల్‌ సప్లయి జిల్లా మేనేజరు రాజు, వ్యవసాయశాఖ జేడీ జగ్గారావు, పెదపాడు తహసీల్దార్‌ ఇందిరాగాంధీ, ఎంపీడీవో నిర్మలజ్యోతి, నల్లజర్ల సొసైటీ అధ్యక్షుడు కారుమంచి రమేశ్‌, నల్లజర్ల తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T05:49:04+05:30 IST