ఆలయాల్లో శ్రావణ సందడి
ABN , First Publish Date - 2021-08-14T05:59:43+05:30 IST
ఆలయాల్లో శ్రావణ మాసం సందడి నెలకొంది.
జంగారెడ్డిగూడెం, ఆగస్టు 13: ఆలయాల్లో శ్రావణ మాసం సందడి నెలకొంది. శుక్రవారం పలుచోట్ల అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చే శారు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో అమ్మవారిని మొదటి శుక్ర వారం లక్ష పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులు అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు యర్రమిల్లి మనోజ్‌శర్మలు అమ్మవారికి పూజాధికాలను నిర్వహించారు.
ద్వారకాతిరుమల: వేంకటేశ్వరస్వామి ఉపాలయం కుంకుళ్లమ్మ దేవాలయంలో మొదటి శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చండీహోమం నిర్వహించారు. భక్తులు, మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.