వాలీబాల్‌ పోటీలకు ఎస్‌ఆర్‌కేఆర్‌ విద్యార్థులు ఎంపిక

ABN , First Publish Date - 2021-12-10T05:12:28+05:30 IST

ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన వీవీపీ. చంద్రమకుమార్‌, ఎన్‌వీకె.చైతన్య జేఎన్‌టీయూకే తరపున ఇంటర్‌ యూనివర్సిటీ వాలీబాల్‌ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ డా.ఎం.జగపతిరాజు చెప్పారు.

వాలీబాల్‌ పోటీలకు ఎస్‌ఆర్‌కేఆర్‌ విద్యార్థులు ఎంపిక
ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న ఎస్‌ఆర్‌కేఆర్‌ యాజమాన్యం

భీమవరం ఎడ్యుకేషన్‌, డిసెంబరు 9 : ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన వీవీపీ. చంద్రమకుమార్‌, ఎన్‌వీకె.చైతన్య జేఎన్‌టీయూకే తరపున ఇంటర్‌ యూనివర్సిటీ వాలీబాల్‌ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ డా.ఎం.జగపతిరాజు చెప్పారు. ఈనెల 18 నుండి 22 వరకు చెన్నై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో జరిగే సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ వాలీబాల్‌ పోటీల్లో ఆడతారని కళాశాల పీడీ డా.పి.సత్యనారాయణరాజు చెప్పారు. విద్యార్థులను కళాశాల సెక్రటరీ ఎస్‌వీ రంగరాజు, సీఈవో ఎస్‌ఆర్‌కే నిశాంతవర్మ,వాలీబాల్‌ కోచ్‌ కె.రామరాజు, పీడీ  సీహెచ్‌.హరిమోహన్‌ అభినందించారు. 


Updated Date - 2021-12-10T05:12:28+05:30 IST