ఆధ్యాత్మిక గోదావరి

ABN , First Publish Date - 2021-07-25T04:57:49+05:30 IST

ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా కొవ్వూరు గోదావరి తీరంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

ఆధ్యాత్మిక గోదావరి
శాకాంబరిగా కొవ్వూరు బాలాత్రిపురసుందరి

కొవ్వూరు, జూలై 24: ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా కొవ్వూరు గోదావరి తీరంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గోష్పాదక్షేత్రం లో బాలాత్రిపుర సుందరి సమేత సుందరేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మానేపల్లి శ్రీనివాసరావు పర్యవేక్షణలో సుందర గణేష్‌ ఆధ్వర్యంలో బాలాత్రిపుర సుందరీ అమ్మవారిని కూరగాయలతో శాకాంబరిగా అలంకరించి పూజలు నిర్వహించారు. గోష్పాద క్షేత్రం సుందరసాయి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని సాయిబాబాకు ప్రత్యేక అబిషేకాలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్నానఘట్టంలోని షిరిడి సాయి ఆలయం, పురుషోత్తమ రామమందిరంలో పండితులు దోర్భల ప్రభాకరశర్మ ఆద్వర్యంలో వ్యాస పౌర్ణమిని పురస్కరించుకుని పూజలు చేశారు. భక్తులు అదికసంఖ్యలో పాల్గొన్నారు.Updated Date - 2021-07-25T04:57:49+05:30 IST