‘స్పందన’ ఫిర్యాదులను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-26T04:58:25+05:30 IST

స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు అన్నారు.

‘స్పందన’ ఫిర్యాదులను పరిష్కరించాలి
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఆర్డీవో మల్లిబాబు

కొవ్వూరు, అక్టోబరు 25: స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో సోమవారం డివిజన్‌ స్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం వ్యయప్రయాసలతో డివిజన్‌, జిల్లా కార్యాలయాలకు వచ్చి సమయం వృధా చేసుకోవద్దన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులకు సమస్యలపై దరఖాస్తులు అందించి రశీదులు పొందాలన్నారు. తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించి కారణాలు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T04:58:25+05:30 IST