సోనోవిజన్‌ లక్కీ డ్రా విజేతలు

ABN , First Publish Date - 2021-01-27T05:39:28+05:30 IST

భీమవరం సోనోవిజన్‌లో మంగళవారం లక్కీ డ్రా నిర్వహించారు.

సోనోవిజన్‌ లక్కీ డ్రా విజేతలు
భీమవరంలో డ్రా తీస్తున్న సంస్థ ప్రతినిధులుఙ

 భీమవరం, జనవరి 26 : భీమవరం సోనోవిజన్‌లో మంగళవారం లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో నాలుగు బంపర్‌ బహుమతులను లక్కీ డ్రా విజేతలకు అందించారు. వి. జ్యోతి (కూపన్‌ నం. 38056) మారుతీ కారు గెలుచుకున్నారు. బి.శేషుబాబు (కూపన్‌ నం. 38174) ఎల్‌ఈడీ టీవీ గెలుచుకోగా, ఎం. నరసింహ రాజు (కూపన్‌ నం.76883) రిఫ్రిజరేటర్‌ను, కె.దుర్గారావు (కూపన్‌ నం.36089) వాషింగ్‌ మెషీన్‌ను గెలుచుకున్నారు. లక్కీ డ్రా కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్‌ తిరుమాని ఏడుకొండలు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సోనోవిజన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పి. భాస్కరమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T05:39:28+05:30 IST