కన్నుల పండువగా సోమేశ్వరస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-03-23T04:38:54+05:30 IST

కాళ్ళలో గంగా పార్వతి సమేత సోమేశ్వరస్వామి కల్యాణం ఆదివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది.

కన్నుల పండువగా సోమేశ్వరస్వామి కల్యాణం
సోమేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

కాళ్ళ, మార్చి 22 : కాళ్ళలో గంగా పార్వతి సమేత సోమేశ్వరస్వామి కల్యాణం ఆదివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. పుల్లేటికుర్తి శేషుమణిదీప్‌శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణానికి గ్రామస్థులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఆలయ ప్రాంగణంలో చిన్నారుల భరత నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ ఈవో కె.శ్రీనివాసరాజు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Updated Date - 2021-03-23T04:38:54+05:30 IST