ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు
ABN , First Publish Date - 2021-03-21T05:37:06+05:30 IST
పనివేళలు ముగియ కుండానే పాఠశాలలను మూసివేసి వెళ్లి పోతున్నారన్న కారణంపై ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు.

ఏలూరు ఎడ్యుకేషన్, మార్చి 20: పనివేళలు ముగియ కుండానే పాఠశాలలను మూసివేసి వెళ్లి పోతున్నారన్న కారణంపై ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు. ఈ మేరకు నిడమర్రు మండలం తోకలపల్లిలోని నెంబర్–1, నెంబరు–2 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్న ఐ.ప్రసన్న కుమార్, భాగ్యలక్ష్మిలపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు వివరించారు.