వేలివెన్నులో సినిమా షూటింగ్‌

ABN , First Publish Date - 2021-11-02T06:19:09+05:30 IST

వేలివెన్నులో కేవీకేఆర్‌ మూవీస్‌ ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ సినిమా షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది.

వేలివెన్నులో సినిమా షూటింగ్‌
కెమెరా స్విచాన్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శేషారావు

ఉండ్రాజవరం, నవంబరు 1: వేలివెన్నులో కేవీకేఆర్‌ మూవీస్‌ ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ సినిమా షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ముహుర్తపు షాట్‌ను కెమెరా స్విచ్‌ ఆన్‌చేసి ప్రారంభించారు. ఈ చిత్రానికి డైరెక్టర్‌ కుందేటి రమేష్‌, నిర్మాత కంభంపాటి బస్వంత్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ చిలుకూరి మోహన్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఎడిటర్‌ పాల తుషార్‌, కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా లలితారెడ్డి కాగా నటీనటులుగా పృథ్వి దండమూడి, మురళీమోహన్‌, పృథ్విరాజ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మి నటిస్తున్నట్టు నిర్మాత  బస్వంత్‌ తెలిపారు.

Updated Date - 2021-11-02T06:19:09+05:30 IST