ఈ జాబ్ క్యాలెండర్ వద్దు
ABN , First Publish Date - 2021-06-26T05:25:08+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అసంపూర్తిగా ఉందని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు అన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకుల నిరసన
పాలకొల్లు అర్బన్, జూన్ 25 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అసంపూర్తిగా ఉందని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు అన్నారు. జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం పట్టణంలో యడ్లబజారు, గాంధీ బొమ్మల సెంటర్లలో నిరసన ప్రదర్శన చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్య క్షుడు కె.సూర్య మాట్లాడుతూ అన్ని ఉద్యోగాలతో కలిపి కొత్త జాబ్ క్యాలెం డర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.పోలీస్, టీచర్, లైబ్రేరియన్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో పట్టణ ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి యశ్వంత్, నాయకులు శివ, అనిల్ బాబు, బాను తదితరులు పాల్గొన్నారు.
బీజేవైఎం అర్ధనగ్న ప్రదర్శన
నరసాపురం, జూన్ 25 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు శుక్రవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జాబ్ క్యాలెండర్‌ను వెంటనే రద్దు చేసి 2.40 లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్ క్యాలెండర్‌ను విడు దల చేయాలని నాయకుడు లీలా కృష్ణ డిమాండ్ చేశారు.