నిర్వాసితుల సమస్యలపై ఆరా

ABN , First Publish Date - 2021-08-26T05:11:53+05:30 IST

నిర్వాసితుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళతా నని కేంద్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు అనంత్‌నాయక్‌ అన్నారు.

నిర్వాసితుల సమస్యలపై ఆరా
నిర్వాసితులతో మాట్లాడుతున్న అనంత్‌ నాయక్‌

జీలుగుమిల్లి, ఆగస్టు 25: నిర్వాసితుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళతా నని కేంద్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు అనంత్‌నాయక్‌ అన్నారు. టేకూరు, ఎర్రవరం నిర్వాసిత కాలనీ ఇళ్లను అ క్కడి సదుపాయాలు బీజేపీ నాయకులతో కలసి అనంత్‌ నాయక్‌ బుధవారం పరిశీలించారు. సదుపాయాలు కల్పించాలని నిర్వాసితులు వినతులు అందజేశారు. సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. మొడియం శ్రీను, కరిబండి నాగ రాజు, బొరగం వెంకటలక్ష్మి, ఆర్డీవో ప్రసన్న లక్ష్మి, వీఆర్వో అనుపమ ఉన్నారు.

Updated Date - 2021-08-26T05:11:53+05:30 IST