‘హిందూ ఆలయ ఆస్తుల సంరక్షణకు ఉద్యమిస్తాం’

ABN , First Publish Date - 2021-11-21T05:30:00+05:30 IST

హిందూ ఆలయాల ఆస్తుల సంరక్ష ణకు అవసరమైతే ఉద్యమి స్తామని సామాజిక సమరసత సంస్థ రాష్ట్ర నా యకురాలు బోగిరెడ్డి ఆదిల క్ష్మి హెచ్చరించారు.

‘హిందూ ఆలయ ఆస్తుల సంరక్షణకు ఉద్యమిస్తాం’

తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు 21 :హిందూ ఆలయాల ఆస్తుల సంరక్ష ణకు అవసరమైతే ఉద్యమి స్తామని సామాజిక సమరసత సంస్థ రాష్ట్ర నా యకురాలు బోగిరెడ్డి ఆదిల క్ష్మి హెచ్చరించారు. స్థానిక గమిని ఫంక్షన్‌ హాలులో ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లా డుతూ  మంత్రి వనిత ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బెదిరిస్తానంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు తప్పవని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూ చించారు.  త్వరలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈతకోట తాతాజి మాట్లాడుతూ శివానంద మఠం భూముల వివాదం మంత్రి వివాదాల్లోకి వెళ్లడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. జిల్లా ఉపాధ్యక్షుడు నరిసే సోమేష్‌ మాట్లాడుతూ దౌర్జన్యపూరితంగా భయబ్రాంతులు చేయాలని చూస్తే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులతో ఉద్యమిస్తామన్నారు. బీజేపీ నాయకులు కోట రాంబాబు, ఎం.దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-21T05:30:00+05:30 IST