సచివాలయానికి స్థలం విరాళం
ABN , First Publish Date - 2021-12-31T05:13:34+05:30 IST
కోలమూ రులో గ్రామ సచివాలయం నిర్మాణానికి ప్రభు త్వం రూ.40లక్షలు మంజూరు చేసింది.

కోలమూరు(ఉండి), డిసెంబరు 30: కోలమూ రులో గ్రామ సచివాలయం నిర్మాణానికి ప్రభు త్వం రూ.40లక్షలు మంజూరు చేసింది. కానీ, స్థల సమ స్య ఏర్పడడంతో పది సెంట్ల స్థలాన్ని ఇచ్చేందుకు భార్యాభర్తలైన సర్పంచ్ నడింపల్లి సత్యవతి, ఉప సర్పంచ్ నడిపంల్లి రామకృష్ణం రాజు (రాంబాబు) ముందుకు వచ్చారు. ఇక్కడి మార్కెట్ రేటు ప్రకారం దీని విలువ సుమారు రూ.50 లక్షలు. ఈ భవన నిర్మాణం పూర్తవడంతో త్వరలోనే ప్రారంభించనున్నారు. తమను ఎన్నుకున్న ప్రజలకు ఏదైనా చేయాలని భావించి ఈ స్థలాన్ని సచివాలయ భవన నిర్మాణానికి అందించినట్టు తెలిపారు.