పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు
ABN , First Publish Date - 2021-11-06T05:00:45+05:30 IST
కార్తీక మాసంలో పంచారామాల దర్శన నిమిత్తం భక్తుల కోసం ప్రతి ఆదివారం తణుకు నుంచి రాత్రి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ డీఎం షేక్ షబ్నం తెలిపారు.

తణుకు, నవంబరు 5: కార్తీక మాసంలో పంచారామాల దర్శన నిమిత్తం భక్తుల కోసం ప్రతి ఆదివారం తణుకు నుంచి రాత్రి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ డీఎం షేక్ షబ్నం తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఈనెల 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి సమయంలో తణుకులో బయలుదేరి సోమవారం అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని శైవ క్షేత్రాలు దర్శనం అనంతరం తణుకు చేరుకుంటుం దన్నారు. ఎక్స్‌ప్రెస్‌కు టిక్కెట్లు పిల్లలకు రూ.635, పెద్దలకు రూ.825, ఆలా్ట్ర డీలక్స్‌కు పెద్దలకు రూ.995, పిల్లలకు రూ.765 రూపాయలని చెప్పారు. బస్సులకు ఆన్‌లైన్ రిజర్వేషను సదుపాయం ఉందని తెలిపారు. ఓకే ప్రాంతం నుంచి పది టిక్కెట్లు ఉంటే మీ దగ్గరకు వచ్చి టిక్కెట్లు బుక్ చేసుకుంటామని, 40 టిక్కెట్లు ఉంటే బస్సు ఆ గ్రామం పంపుతామని వివరించారు. ఇతర వివరాలకు 73829 08909, 98491 69396కు సంప్ర దించాలని కోరారు.
నిడదవోలు: నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 7, 14, 21, 28 తేదీలలో పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామని రిజర్వేషన్ సౌకర్యం కలదని డిపో మేనేజర్ కె.శ్రీరామ్‌కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు 91009 54632, 0881 3221064 నెంబర్లలో సంప్రది ంచాలని కోరారు.