రాష్ట్రస్థాయి రోప్‌స్కిప్పింగ్ విజేతలకు అభినందన
ABN , First Publish Date - 2022-01-01T05:16:45+05:30 IST
రాష్ట్రస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో ఎస్‌సీ హెచ్‌బీ ఆర్‌ఎం విద్యార్థులు మంచి ప్రతిభకనబరిచి పతకాలు సాధించారని సెక్రటరీ కె.రామకృష్ణంరాజు తెలి పా రు

భీమవరం ఎడ్యుకేషన్, డిసెంబరు 31 : రాష్ట్రస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో ఎస్‌సీ హెచ్‌బీ ఆర్‌ఎం విద్యార్థులు మంచి ప్రతిభకనబరిచి పతకాలు సాధించారని సెక్రటరీ కె.రామకృష్ణంరాజు తెలి పా రు.పాఠశాలలో శుక్రవారం విద్యార్థులను అభినందించి మాట్లాడా రు.డిసెంబరు 28,29 తేదీల్లో గుం టూరులో జరిగిన 14వ రాష్ట్రస్ధాయి రోప్‌స్కిప్పింగ్ పోటీల్లో స్కూల్ విద్యార్థులు 9 మంది ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించారన్నారు.డీఎన్నార్ కళాశాల అధ్యక్షకార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, హెచ్‌ఎం శ్రీనివాసరావు, పీడీ శేఖరరాజు, రామభద్రరాజు అభినందించారు.