రోడ్డు ప్రమాదం ... బాలుడి మృతి

ABN , First Publish Date - 2021-11-10T05:17:54+05:30 IST

బైక్‌పై వెళుతుండగా లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతి చెందగా, పెదనాన్నకు తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదం ... బాలుడి మృతి

పెదనాన్నకు తీవ్ర గాయాలు
దెందులూరు, నవంబరు 9 : బైక్‌పై వెళుతుండగా లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతి చెందగా, పెదనాన్నకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలివి. దెందులూరు శివారు సత్యనారాయణపురంలో పిక్క బంగారయ్య, తోడల్లుడు తెరగాడ చిన్నారెడ్డి నివసిస్తున్నారు. చిన్నారెడ్డి కుమారుడు జస్వంత్‌(6)కు తినుబండారాలు కొనిస్తానని బంగారయ్య మంగళవారం తన బైక్‌పై దెందులూరు బయల్దేరాడు. కొవ్వలి అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొన్నాడు. బైక్‌ ట్యాంక్‌పై కూర్చున్న జస్వంత్‌ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన బంగారయ్యను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  ఘటనపై విచారణ చేస్తున్నట్టు దెందులూరు ఎస్‌ఐ వీర్రాజు తెలిపారు.


Updated Date - 2021-11-10T05:17:54+05:30 IST