రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2021-11-06T05:02:24+05:30 IST
చించినాడ–దిగమర్రు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందా డని రూరల్ ఎస్‌ఐ కె.శ్రీనివాస్ తెలిపారు.

న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్థుల ఆందోళన
పాలకొల్లు అర్బన్, నవంబరు 5 : చించినాడ–దిగమర్రు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందా డని రూరల్ ఎస్‌ఐ కె.శ్రీనివాస్ తెలిపారు. పెదమామిడిపల్లికి చెందిన గీత కార్మికుడు గుబ్బల శ్రీనివాస్ (55) శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు.
ఫ శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్థులు, మృతుడి బంధువులు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఆందోళనకారులకు, పోలీసులకు కొద్డిసేపు వాగ్వాదం జరిగింది, అనంతరం రూరల్ సీఐ డి.వెంకటేశ్వరరావు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. శ్రీనివాస్ కుటుంబసభ్యులను జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.