లారీని ఢీకొన్న కారు.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-06-21T06:23:56+05:30 IST

జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమా దంలో ఒకరు మృతి చెందారు.

లారీని ఢీకొన్న కారు.. ఒకరి మృతి
ప్రమాదానికి గురైన కారు

తణుకు, జూన్‌ 20: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమా దంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగిం ది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెం దిన మరద గౌరినాయుడు (62)తో పాటు ఆయన కుమారుడు  దిలీప్‌ కుమార్‌, భార్య మంగమ్మ, కుమార్తె హేమలత, చిన్నారి అర్యహి కలసి కారులో విజయనగరం వెళుతుండగా శనివారం రాత్రి తణుకు బైపాసు రోడ్డులోని డిమార్టు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గౌరినాయుడు మృతి చెందగా, మిగిలిన వారికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-06-21T06:23:56+05:30 IST