లారీ కింద పడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-06-23T05:04:33+05:30 IST

ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

లారీ కింద పడి ఒకరి మృతి

ద్వారకాతిరుమల, జూన్‌ 22: ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలోని ఎం.నా గులపల్లి పంచాయతీ పరిఽధిలో ద్వారకానగర్‌ వద్ద మంగళవారం ఈ ప్రమాదం  జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం ఏలూరు నగరానికి చెందిన రావెళ్ల హరిసాయి(35) పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ఏలూరు నుంచి రాజమండ్రి వెళుతున్న లారీ కింద పడడంతో హరిసాయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.

Updated Date - 2021-06-23T05:04:33+05:30 IST