వెంటాడిన మృత్యువు..

ABN , First Publish Date - 2021-12-31T05:16:22+05:30 IST

తణుకు డీ మార్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త అరిగెల జయరాజు (32) మృతి చెందగా, భార్య నాగదుర్గకు తీవ్ర గాయాలయ్యా యి.

వెంటాడిన మృత్యువు..
రోడ్డు ప్రమాదంలో గాయాలైన దంపతులు

బైక్‌ అదుపుతప్పి కిందపడిన దంపతులు

లారీ ఢీకొని భర్త మృతి, భార్యకు గాయాలు 

తణుకు, డిసెంబరు 30 : తణుకు  డీ మార్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త అరిగెల జయరాజు (32) మృతి చెందగా, భార్య నాగదుర్గకు తీవ్ర గాయాలయ్యా యి. గురువారం పెరవలి మండలం ముక్కా మలకు చెందిన దంపతులు బైక్‌పై తణుకు షాపింగ్‌కు వస్తున్నారు. డీమార్టు సమీపంలో బైక్‌ అదుపు తప్పి కిందపడగా వెనుక నుంచి వస్తున్న గ్యాస్‌ సిలెండర్ల లారీ ఇద్దరిని ఢీకొనడంతో రక్తపు గాయాలయ్యాయి. జయరాజు అక్కడికక్కడే మృతిచెందగా, నాగదుర్గను 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు బంధువులు తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధి కోసం జనవరి మూడున జయరాజు దుబాయ్‌ వెళ్లాల్సి ఉండడంతో పండుగ నిమిత్తం తణుకులో బట్టలు, ఇతరవస్తువులు కొనుగోలు చేసేందుకు వస్తున్నట్టు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న సీఐ ఆంజనేయులు ఘటన స్థలానికి చేరుకుని తీవ్ర గాయాల్తెన ఆమెను 108 వాహనంలోకి ఎక్కించేందుకు సాయం చేశారు. భర్త జయరాజును తన జీపులో ఎక్కించుకుని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. సీఐ చొరవ పట్ల పలువురు అభినందనలు తెలిపారు. మృతుడి సోదరుడు గోతురాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్‌ఐ కె.గంగాధరరావు తెలిపారు. Updated Date - 2021-12-31T05:16:22+05:30 IST