కారు ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-12-31T05:17:24+05:30 IST

బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులను ఒక కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.

కారు ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు

ద్వారకా తిరుమల, డిసెంబరు 30 : బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులను ఒక కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. బుట్టాయగూడెం హైవేపై గురువారం తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోవడాన్ని గుర్తించిన స్థానిక పోలీ సులు పెట్రోలింగ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కారును పట్టుకున్నారు. తాళ్లపూడికి చెందిన కె.పుల్లయ్య, ఉమ ఏలూరులో జరిగిన ఓ శుభకార్యానికి బైక్‌ పై వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, ఏలూరు నుంచి రాజమండ్రివైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొంది. క్షతగాత్రులను స్థానికులు భీమడోలు పీహెచ్‌సీకి తరలించి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-31T05:17:24+05:30 IST