ఉరికిన వాగులు.. నిండిన జలాశయాలు
ABN , First Publish Date - 2021-07-24T05:33:02+05:30 IST
భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగడంతో పాటు జలాశయాలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి.

జంగారెడ్డిగూడెం / టి.నరసాపురం / బుట్టాయగూడెం / కొవ్వూరు
భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగడంతో పాటు జలాశయాలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. శుక్రవారం వర్షం తగ్గు ముఖం పట్టినా సాయంత్రం, రాత్రి వేళల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జంగా రెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయంలోకి ఈ సీజన్‌లో మొదటిసారిగా ఇన్‌ఫ్లో ప్రారంభ మైంది. గంటకు 1467 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. జలాశయం పూర్తి నీటమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 79.71 మీటర్లు నమోదైంది. 82 మీటర్ల నీటి మట్టం దాటితే డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు. గ్రామాల్లో చిన్న చెరువులు సైతం జలకళను సంతరించుకుంటు న్నాయి. మండలంలో పట్టెన్నపాలెంలో జల్లేరు వాగు ఉదృతంగా ప్రవహిం చడంతో శుక్రవారం అటుగా రాకపోకలు నిలిచిపోయాయి. టి.నరసాపురం మండలంలో చింతలవాగు పొంగి ప్రవహించడం తో మక్కినవారిగూడెం, టి.నరసాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. టి.నరసా పురం నుంచి మక్కినవారిగూడెం వెళ్లే వాహనదారులు చింతలపూడి మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తుంది. చింతలవాగు ఉధృతితో పోలీసుశాఖ ప్రమాదకర హెచ్చరికలు జారీచేసి గస్తీ నిర్వహించారు. బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయానికి వరద నీరు చేరు తూనే ఉంది. శుక్రవారం జలాశయానికి ఇన్‌ఫ్లో 183 క్యూసెక్కులు ఉన్నట్లు ఇరిగేషన్ ఏఈ కిరణ్ తెలిపారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ప్రాజెక్టు నీటి మట్టం 213 ఎంటీ ఎస్‌కు చేరుకుందన్నారు. శుక్రవారం ఉద యం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్‌ఫ్లో తగ్గింది.
కొవ్వూరు పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 6.30గంటల సమయంలో ఒక్కసారిగా కురిసిన వర్షంతో పట్టణంలోని మెయిన్‌రోడ్‌పై జైన మందిరం నుంచి మధురం హోటల్ వరకు రోడ్డుపై నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
