రెవెన్యూ సిబ్బంది వేగవంతంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2021-11-24T04:38:01+05:30 IST

రెవెన్యూ అధికారులు, సిబ్బంది శాశ్వత గృహ హుక్కు పథకంపై వేగవంతంగా పనిచేయాలని ఆర్డీవో ప్రసన్నలక్ష్మి సూచించారు.

రెవెన్యూ సిబ్బంది వేగవంతంగా పనిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నలక్ష్మి

పోలవరం, నవంబరు 23: రెవెన్యూ అధికారులు, సిబ్బంది శాశ్వత గృహ హుక్కు పథకంపై వేగవంతంగా పనిచేయాలని ఆర్డీవో ప్రసన్నలక్ష్మి సూచించారు. తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ అఽధికారులు, సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. జగనన్న గృహ హక్కు పథకంలో ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌, వాక్సినేషన్లు తదితర అంశాలపై అధికారులను, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సీహెచ్‌.శ్రీనివాసబాబు, తహసీల్దారు బి.సుమతి, ఆర్‌ఐలు వెంకటరెడ్డి, ఖాజా రమేశ్‌, వీఆర్వోలు సాయి, వెంకటే శ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T04:38:01+05:30 IST